తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా బుల్లి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ,  రెండవ సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత 3 , 4 , 5 , 6 వ  సీజన్ లకు టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. వీటితో పాటు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ కి కూడా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఫైనల్ ఎపిసోడ్ ముగిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో సింగర్ రేవంత్ విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ 6 లో విజేతగా నిలిచిన సింగర్ రేవంత్ మొత్తం బిగ్ బాస్ ద్వారా ఎంత ప్రైజ్ సంపాదించాడో చూద్దాం.

బిగ్ బాస్ విన్నర్ సింగర్ రేవంత్ ప్రైజ్ మనీ 10 లక్షల తో పాటు ,  30 లక్షల విలువైన 650 గజాల ఫ్లాటును కూడా గెలుచుకున్నాడు. అలాగే మారుతి సుజుకి బ్రేజా కారును కూడా రేవంత్ అందుకోనున్నాడు. దీనితో పాటు రేవంత్ పారితోషకం కింద ఒక్కో వారానికి 60 వేల రూపాయల నుండి 80 వేల రూపాయల వరకు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దానితో మొత్తం 15 వారాలకు కలిపి తొమ్మిది లక్షల నుండి 11 లక్షల వరకు అందుకోబోతున్నట్లు తెలుస్తోంది .ఈ లెక్కన రేవంత్ బిగ్ బాస్ ద్వారా దాదాపు 60 లక్షల వరకు సంపాదించుకున్నట్లు ఒక టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: