
ఇదిలా ఉండగా ఇటీవల మళ్ళీ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి ప్రపంచ స్థాయిలో పాపులారిటీని దక్కించుకున్నారు. అంతేకాదు రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు విదేశాలలో ఉండే డైరెక్టర్లు కూడా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా ఒక్క సినిమాతో ప్రపంచ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకోవడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు మళ్లీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో #RC 15 పేరిట ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవలేదు. అప్పుడే సుకుమార్ శిష్యుడు ఉప్పెన మూవీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లోలోపలే పలువురు డైరెక్టర్ల నుంచి కథలు వింటున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు డైరెక్టర్లు తమ స్క్రిప్ట్లను వినిపిస్తున్నారట. మరి ఏ సినిమాకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.