బిగ్ బ్రదర్ పేరిట విదేశాలలో ప్రారంభమైన ఈ రియాల్టీ షోని ఇండియాలో కూడా పలు పాపులర్ చెందిన భాషలలో బిగ్ బాస్ పేరిట విడుదల చేసి భారీ పాపులారిటీని దక్కించుకుంటుంది. ఇప్పటికే హిందీలో 16వ సీజన్ ముగింపుకి దగ్గరలో ఉండగా.. తెలుగులో ఆరవ సీజన్ ఈనెల 18వ తేదీన చాలా ఘనంగా పూర్తయింది. అయితే గత సీజర్లతో పోల్చుకుంటే ఈ సీజన్ టిఆర్పి రేటింగ్ అత్యంత దారుణంగా వచ్చిందని చెప్పవచ్చు. నిజానికి కొత్త కంటెస్టెంట్లు రావడంతో వీరి గురించి ప్రేక్షకులకు పెద్దగా అవగాహన లేకపోవడం.. మరొకవైపు నాగార్జున హోస్టింగ్ విని బోర్ కొట్టడం అన్నీ కూడా షోకి మైనస్ పాయింట్ అయ్యాయి.

దీంతో బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి నాగార్జున తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అసలు విషయంలోకెళితే సీజన్ వన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా రాగా ఈ షో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హాజరయ్యారు.  తర్వాత మూడవ సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు హోస్ట్ గా నాగార్జున వ్యవహరించారు . దీంతో వరుసగా ఆయననే హోస్ట్గా చూసేసరికి ప్రజలలో ఆసక్తి కూడా కోల్పోయింది.  అంతేకాదు నాగార్జున కూడా బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించాడు.  దీంతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి కొత్త హోస్టు ఎవరనే వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. పాన్ ఇండియా హీరో రానా దగ్గుబాటి తో పాటు నటసింహ బాలకృష్ణ పేర్లు ఈ లిస్టులో వినిపిస్తున్నాయి.  అయితే నాగార్జున రానా దగ్గుబాటి పేరు సజస్ట్ చేసినట్లు తెలుస్తోంది.  మరి ఈ ముగ్గురిలో ఎవరు హోస్ట్ గా రాబోతున్నారో తెలియాలి అంటే వచ్చే ఏడాది జూలై వరకు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: