టాలీవుడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ అఖండ సినిమా అనంతరం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.బాలకృష్ణ మరియు శృతిహాసన్ జంటగా నటిస్తున్న వీరసింహారెడ్డి త్వరలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కాగా ఆయన 108వ సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడి తో చేస్తున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. భారీ అంచనాలతో తెరకెక్కనున్న ఈ సినిమా పై నందమూరి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న

 ఈ సినిమాని పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడానికి అనిల్ రావిపూడి సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా బాలయ్య నటించబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా పెళ్లి సందడి సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీని దక్కించుకున్న శ్రీ లీల ని బాలయ్య కి జోడిగా ఫిక్సయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సినిమాలో వీరిద్దరూ కనిపిస్తారు కానీ హీరో మరియు హీరోయిన్లుగా కాదని తండ్రీ కూతుర్ల పాత్రలో వీరిద్దరూ కనిపించరు ఉన్నారని తెలుస్తోంది. ఇక బాలయ్య తండ్రిగా శ్రీ లీలా కూతురిగా ఈ సినిమాలో కనిపిస్తారు

 అన్న విషయం తెలిసిన వీరి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో ఇప్పటికే నటుడు శరత్ కుమార్ మరియు మరికొందరు నటీనటులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దీంతో టాలీవుడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: