ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. మొదటగా కన్నడలో ఎంట్రీ ఇచ్చిన ఈమె దాని అనంతరం కెరటం సినిమాతో టాలీవుడ్ కి రావడం జరిగింది. మొదట్లో సరైన సక్సెస్ను అందుకోలేకపోయినా  దాని అనంతరం వరుస సినిమాలు చేస్తూ ఇప్పుడు స్టార్ హీరోయిన్గా చలామణి అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకి అంత క్రేజ్ లేకపోయినప్పటికీ హిందీ ,తమిళం భాషల్లో వరుస అవకాశాలు రకుల్ ప్రీత్ సింగ్ కి వస్తున్నాయి. తాజాగా తమిళంలో శివ కార్తికేయన్ సరసన నటించిన ఈమె దాని అనంతరం వరస సినిమాలతో బిజీగా ఉంది.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. దీంతోపాటు కమలహాసన్ సరసన ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తోంది ఈమె. ఇదిలా ఉంటే ఇక ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ ఈమె బాయ్ ఫ్రెండ్ గురించి వెల్లడించిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈయనతో కలిసి తిరుగుతుంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఈమె పుట్టినరోజు వేడుకలను కూడా తన బాయ్ ఫ్రెండ్ తోనే కలిసి జరుపుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది రకుల్. దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ శాంటా ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పుకొచ్చింది రకుల్. దీంతో వచ్చే ఏడాది  వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీనికిగాను చాలామంది వీరిద్దరూ నిజంగా ప్రేమికుల కాదా అన్న కామెంట్లు కూడా చేస్తున్నారు. దాంతోపాటు నిజంగా వీరిద్దరూ వచ్చేయడాది పెళ్లి చేసుకుంటారా అని కూడా అంటున్నారు. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రకుల్ ప్రీత్ సింగ్ చేసే వరకు ఈ వార్తలు ఎంత నిజం ఉందో తెలియదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: