మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నాడు.మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది సంగతి మనందరికీ తెలిసిందే. బాబి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ ఒక కీలక పాత్రలో నటించడం జరిగింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో చాలా ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల ఆయన హీరోగా నటించిన ఆచార్య  సినిమా ఫ్లాప్ అవడంతో

 ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు చిరంజీవి అభిమానులు. దాంతోపాటు ఆ సినిమా అనంతరం వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా కూడా అంతంత మాత్రమే ఉండడంతో వాల్తేరు వీరయ్య సినిమా అయినా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని ఆశపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే  చిరంజీవి గురువారం చిత్రపురి కాలనీలోని నూతన గృహ సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగానే లబ్ధిదారులకు ఇంటికి సంబంధించిన తాళాలను మరియు ఆ ఇంటి పత్రలను అందజేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు చెప్పాడు.

ఇందులో భాగంగానే సినీ పరిశ్రమంలో నేను పెద్దను కాను అని చాలామంది చిన్నవాళ్లు నన్ను ఇంతటి వాడిని చేశారు అని వెల్లడించాడు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాకుండా కార్మికులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి అండగా నేను ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. యావత్ భారత దేశంలోనే ఇలా సినీ కార్మికు లకు గృహ సముదాయం లేదు అని ఈ కల ప్రభాకర్ దూరదృష్టి వల్లే నిజమైంది అని చెప్పవచ్చాడు మెగాస్టార్ చిరంజీవి . ఇదిలా ఉంటే ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించి ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని పాటలు టీజర్ విడుదల కావడం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమాలోని పాటలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: