ఇండస్ట్రీలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కొంతమందిని చూస్తే ఏకంగా చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. వాళ్ళు చేసే క్యారెక్టర్లు మాత్రమే కాదు నిజ జీవితంలో వారి మంచి మనసు కూడా అలాగే ఉంటుంది అని చెప్పాలి. ఇక అలాంటి వారిలో క్యారెక్టర్ ఆర్టిస్టు సుధా కూడా ఒకరు అని చెప్పాలి. ఎన్నో వందల సినిమాల్లో నటించి తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకుంది సుధా. ఇక అప్పట్లో ఉత్తన పాత్రలతో ఎంతలా ప్రభావం చూపిందంటే ఏదైనా సినిమాలో హీరో తల్లి పాత్ర ఉంది అంటే చాలు ప్రతి ఒక్కరికి సుధ మొదటి ఆప్షన్ గా మారిపోతూ ఉండేది అని చెప్పాలి.



 ఒకప్పుడు ఉదయ్ కిరణ్,తరుణ్ కాలం నాటి నుంచి మొన్నటికి మొన్న చరణ్, ఎన్టీఆర్ కాలం నాటి వరకు కూడా తల్లి పాత్రల్లో నటించి ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది సుధ. ఇక ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి కాస్త దూరంగానే ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధా జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఎన్టీఆర్ మనస్తత్వం ఏంటి ఇతరులతో ఎలాంటి స్వభావంతో ఉంటారు అన్న విషయాలను ప్రస్తావించింది సుధా.


ఇంటర్వ్యూలో సుధా మాట్లాడుతూ.. నేను నా కెరియర్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించాను. ఇక ఎంతోమందికి తల్లిపాత్రలు కూడా చేశాను. కానీ తారక్ లాంటి నటుడిని మాత్రం నా కెరియర్లో మొదటిసారి చూశాను. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అని ఆయనను  చూసి నేర్చుకోవచ్చు. ఇక తారక్ హీరోగా నటించిన బాద్ షా సినిమాలో ఆయనతో కలిసి స్టెప్పులు వేయాలి. సరదాగా ప్రోగ్రాంలో స్టెప్పులు వేసే సీన్ ఉంటుంది.  ఆ సమయంలో నాకు డాన్స్ రాక కాలు బెణికింది. ఇక అది గమనించిన తారక్ వెంటనే కాళ్లు పట్టుకొని నన్ను కూర్చోబెట్టి స్ప్రే చేసి.. నా పట్ల ఎంతో కేరింగ్ తీసుకున్నాడు.  అంత పెద్ద హీరో నా కాళ్లు పట్టుకోవడం ఏంటి అని నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను  అప్పుడే తారక్ మంచి మనసు అర్థమయింది అంటూ సుధా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: