గీతా గోవిందం సినిమా గురించి అందరికి తెలుసు.. రష్మిక, విజయ్ దేవరకొండ.. గీతా గోవిందం సినిమాలో నటించి భారీ హిట్ ను అందుకున్నారు.. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించారు. అది హిట్ అవ్వలేదు.. కానీ వీరిద్దరి మధ్య ప్రేమను చిగురింప చేసింది.. అప్పటి నుంచి ఎప్పుడు సమయం దొరికినా కూడా మాల్దీవుల్లో వాలిపోతున్నారు.. కొన్ని రోజుల నుంచి హీరో విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే... అందుకు సంబందించి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.. ఈ విషయాన్ని వీరు అప్పుడప్పుడూ ఖండిస్తూ వస్తున్నారు. వారి ప్రేమకు సాక్ష్యంగా వీరిద్దరూ చాలా సార్లు కలిసి కనిపిస్తూనే ఉన్నారు.


ఇప్పటికే ఒకసారి మాల్దీవులకు వెళ్లేటప్పుడు విజయ్ దేవరకొండ పెట్టుకున్న గాగుల్స్ ఆ తర్వాత రష్మిక మందన ముఖాన కనిపించడం తో వీరిద్దరూ కలిసే వెకేషన్ కి వెళ్లారని అప్పట్లో ప్రచారం జరిగింది.ఇకపోతే విజయ్ దేవరకొండ ఇంట్లో ఉన్నట్లుగా అప్పట్లో కొన్ని ఫోటోలను మీడియా తెర మీదకు తెచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెళ్లారు అని అర్థం వచ్చేలా మరోసారి పోస్టులు పెట్టారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టినట్లుగానే ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ పోస్టులు పెట్టారు.


అయితే ఆ ఇద్దరు ఫోటోలు పెట్టిన బ్యాగ్రౌండ్ ఒకలాగే ఉండడంతో ఖచ్చితంగా ఈ ఇద్దరూ కలిసే మాల్దీవులకు వెళ్లారని మరోసారి వార్తలు గుప్పుమన్నాయి..వీరిద్దరి మధ్య నిజంగా అది ఉందా..లేదా అని జనాలు జుట్లు పీక్కుంటూన్నారు..వీరి రిలేషన్ గురించి ఎప్పుడూ బయట పెడతారో చూడాలి.. ఇంతకీ పెళ్ళి చేసుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. ఇక ఇద్దరు వరుస సినిమాలతో బిజిగా ఉన్నారు.. రష్మిక పుష్ప2 లో చేస్తుంది..మరో హిందీ సినిమా చేస్తుంది.. మరి ఈ వార్తలపై వీరిద్దరు ఎలా స్పందిస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: