బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ గా పేరొందిన రణవీర్ దీపికా పదుకొనే జంట గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం బాలీవుడ్లో ఇద్దరు భారీ స్టాంర్డంతో దూసుకుపోతున్నారు. ఇక కొంతకాలం వరకు ప్రేమించుకున్న ఈ జంట కొంతకాలం కింద వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.అయితే ఈ మధ్యకాలంలో ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తల ప్రచారం అవుతున్నాయి. దాని ప్రకారం రణబీర్ దీపికా దంపతులు పలు కారణాలవల్ల విడాకులు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

 కానీ తర్వాత అవన్నీ కూడా నిజం కాదని తెలిసింది. ఇక ప్రస్తుతం రణవీకపూర్ దీపిక పదుకొనే తమ తమ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హీరో రణవీర్ సింగ్ తన భార్య దీపికా పదుకొనే కు అద్భుతమైన కానుకను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక భార్య కోసం రణబీర్ ఇచ్చిన గిఫ్ట్ గురించి తెలిసిన బాలీవుడ్ ఇండ్రస్ట్రీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఇంతకీ అంత షాక్ ఇచ్చే గిఫ్ట్ దీపికకు రణవీర్ ఎలాంటి గిఫ్ట్ ఈచాడనే విషయానికి వస్తే ఈ దంపతులు ఇప్పటికే ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. అయితే తాజాగా రణవీర్ సింగ్ మరోసారి భార్య దీపికా పదుకొనకు మరొక కొత్త బంగ్లాను కానుకగా ఇచ్చారు.

అంతేకాదు ముంబైలోని అగ్ర హీరోలైన షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇంటికి సమీపంలో రణవీర్ తాజాగా ఓ బంగ్లాను కొనుగోలు చేసి తన భార్య దీపికా పదుకొనే ఇష్టానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఈ బంగ్లాను డిజైన్ చేయించాడట. ఈ బాలీవుడ్ హీరో ఇలా అన్ని హంగులతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ బంగ్లా ఖరీదు ఏకంగా 119 కోట్ల రూపాయలని సమాచారం. ఇక ఈ విషయం కాస్త తెలియడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కసారిగా అర్చర్యానికి లోనవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే చర్చనీయాంశంగా మారుతుంది. భార్య కోసం ఏకంగా 119 కోట్లు పెట్టి ఓ బంగ్లాను కొనుగోలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు.ఇక ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక దీపికా పడుకొనే ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సరసన పఠాన్ అనే సినిమాలో నటించింది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రణవీర్ సింగ్ తాజాగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: