ఈ క్రమంలోనే తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. మదరాసపట్టణం , దైవ తిరుమగల్, తలైవా చిత్రాల ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ఏఎల్ విజయ్ కి గోల్డెన్ వీసాను బహూకరించింది.. 2021 డిసెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి గోల్డెన్ వీసా అందుకున్న మొదటి తమిళ నటుడుగా ఆర్. పార్థిపన్ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. వీరే కాకుండా గత రెండు సంవత్సరాలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోలీవుడ్ లోని ప్రముఖులకు గోల్డెన్ వీసా అందిస్తోంది. ఇప్పటికే గత ఏడాది నవంబర్లో సంగీత స్వరకర్త యువన్ శంకర్ రాజా తో పాటు స్టార్ హీరో విక్రమ్ లకి కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను అందించారు.
వీరితోపాటు ప్రముఖ నటుడు నాజర్, సంగీత దర్శకుడు రెహమాన్ అలాగే ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ వెంకట ప్రభు కూడా తాజాగా గోల్డెన్ వీసా అందుకున్నారు. వీరితో పాటు ఉలగనాయగన్ కమల్ హాసన్ గత ఏడాది జూలైలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి గోల్డెన్ వీసా అందుకున్నారు. వీరితోపాటు నటి అమలాపాల్, త్రిష, రాయ్ లక్ష్మీ కూడా గోల్డెన్ వీసాను అందుకున్నారు. గోల్డెన్ వీసాలు దుబాయ్ ప్రభుత్వం చేత అందివ్వబడతాయి. అయితే ప్రతి ఒక్కరికి కూడా గోల్డెన్ వీసాలను టాలీవుడ్ బ్యూటీ పూర్ణ భర్త అసిఫ్ చేతులు మీదుగా బహుకరిస్తూ ఉండడం గమనార్హం.