స్టార్ హీరో యష్ హీరోగా నటించిన కే జి ఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా 1200 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి  గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్గా నటించినప్పటికీ ఈమెకి మాత్రం అవకాశాలు రావడం లేదు. అయితే విక్రమ్ కోబ్రాలో నటించిన ఈమె ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.ఇలాంటి సమయంలోనే ఏ సినిమాలోనైనా నటించేందుకు రెడీ అయ్యింది ఈ భామ. 

అయితే తాజాగా వెంకటేష్ హీరోగా హిట్ ఫెమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఒక సినిమా రానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది .త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. జనవరి 26న ఓపెనింగ్ కూడా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఆఫర్ తనకి ప్లస్ అవుతుంది అని చెప్పాలి. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో టైం వస్తే ఎలాంటి హీరోతోనైనా సినిమా చేయాలి.. ఒక్కొక్కసారి ఎవరూ ఊహించిన విధంగా సీనియర్ హీరోలతో నటించిన హీరో సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటాయి.

అయితే తాజాగా ధమాకా సినిమాలో నటించిన రవితేజ మరియు శ్రీ లీలల జంట గురించి రకరకాల ట్రోల్స్ మరియు మీన్స్ కూడా వచ్చాయి. ఇక సినిమా విడుదల అనంతరం వీరిద్దరి జోడిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సినిమా విడుదల అనంతరం ఈ జంట మీద ఎలాంటి ఫిర్యాదు లేకుండా సినిమాని బాగా ఎంజాయ్ చేశారు.అయితే ఈ విధంగానే శ్రీనిధి శెట్టి వెంకటేష్ తో జతకడితే బాగుంటుందని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక ఈ సినిమాని శైలేష్ రెండు భాగాలుగా తలకెక్కించనున్నారని తెలుస్తోంది .అయితే ఇప్పటికే హిట్ సినిమాని నానితో చేయనున్నాడు శైలేష్ .అయితే ఈ క్రమంలోనే వెంకటేష్ తో కూడా సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: