నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే కూడా అద్భుతమైన క్రేజ్ ను కలిగి ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా మైత్రి సంస్థ నిర్మించిన వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాడు.

మూవీ తాజాగా జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటికే రెండు రోజులు బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకొని ... మూడవ రోజు బాక్స్ ఆఫీస్ రన్ లోకి ఎంట్రీ అయ్యింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో పాటు ఇప్పటికే సంక్రాంతి కానుకగా ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ... అజిత్ హీరోగా తెరకెక్కిన తెగింపు ... సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కళ్యాణం కమనీయం ... విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు సినిమాలు కూడా విడుదల కావడంతో ఈ మూవీ కి మొదటి రోజుతో పోలిస్తే మూడవ రోజు కాస్త థియేటర్ ల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ఈ రోజు 450 థియేటర్ లు లభించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మూడవ రోజు కూడా మంచి కలెక్షన్ లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: