సాధారణంగా ఒక సినీ ప్రేమికుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి అంటే మినిమం 400 రూపాయల ఖర్చు అవుతుంది. అదే ఫ్యామిలీతో కలిసి సినిమా వీక్షించాలి అంటే 2000 రూపాయలను కచ్చితంగా తన దగ్గర ఉంచుకోవాల్సిందే. అంతలా సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని అందుతున్న నేపథ్యంలో.. మరొకవైపు థియేటర్లలో లభించే స్నాక్స్ ధరలు కూడా మిన్నంటుతున్నాయి. పైగా వెహికల్ పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి ఈ క్రమంలోని సామాన్య ప్రేక్షకులు ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడానికి వెనుకడుగు వేస్తున్నారు.

అయితే ఇదే విషయంపై ప్రభుత్వం కూడా ఆలోచించి టికెట్ ధరలను తగ్గించి సామాన్య ప్రజలు కూడా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం థియేటర్లలో విడుదలవుతున్న చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి కానీ సామాన్య ప్రజలు మాత్రం ఆ ధర లతో ఇప్పటికీ సినిమా థియేటర్లలోకి వెళ్లలేకపోతున్నారు. ప్రస్తుతం ఒక్కొక్క సినిమా టికెట్ ధర రూ.240 పైమాటే. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినీ ప్రేమికులకు నిర్మాతలు అలాగే సినిమా థియేటర్ ఓనర్స్ కూడా శుభవార్త తీసుకొచ్చారు.


సినిమా లవర్స్ డే సందర్భంగా వచ్చే శుక్రవారం పివిఆర్ సినిమాస్లోని అన్ని షోలకు ఒక్కో టికెట్ ధర కేవలం 99 రూపాయలు మాత్రమే. ఈ విషయం తెలిసి అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. సంక్రాంతికి ఎలాగో నాలుగు సినిమాలు విడుదలై పోటీపడుతున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఒక చిన్న సినిమా కూడా వీరికి పోటీగా వచ్చింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య , బాలకృష్ణ వీరసింహారెడ్డి,  సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం సినిమాలతో పాటు కోలీవుడ్ సినిమాలైనా అజిత్ తునివు, విజయ్ వారిసు చిత్రాలు కూడా విడుదలయ్యాయి.  ఈ క్రమంలోని ఈ చిత్రాలను చూడాలనుకునేవారు సినిమా లవర్స్ డే రోజున అంటే వచ్చే శుక్రవారం రోజు కేవలం 99 రూపాయలకే ఈ సినిమాలను వీక్షించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: