ప్రపంచం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. సినీ ఇండస్ట్రీలో విజయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచి ప్రస్తుతం వరుస సినిమాలో చేస్తున్నాడు. ఒకప్పుడు కేవలం టాలీవుడ్ కే పరిమితమైన రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం గతేడాది వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి రాజమౌళి చేరాడు. ప్రస్తుతం రాజమౌళి ఆస్కార్ బరిలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి గాను రకరకాల అవార్డుల సైతం రావడం జరిగింది. 

తాజాగా హాలీవుడ్ మ్యాగజైన్ కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. రాజమౌళి. ఇక అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పడం జరిగింది. రాజమౌళి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. నేను డబ్బుల కోసమే సినిమాలు చేస్తాను.. కానీ విమర్శల ప్రశంసల కోసం కాదు.. గతేడాది విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమా పక్క కమర్షియల్. ఈ సినిమా కమర్షియల్ గా మంచి వసూళ్లను సాధించింది. దీంతో నేను చాలా సంతోషించాను. కలెక్షన్లు మాత్రమే కాకుండా ఈ సినిమాకి చాలా అవార్డులో కూడా రావడంతో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ సినిమాకు అవార్డులో రావడానికి కారణం మా యూనిట్ పడిన కష్టం.

దానికి ప్రతిఫలమే ఈ అవార్డులు. ముఖ్యంగా అవార్డుల విషయంలో నేను చాలా గర్విస్తున్నాను అంటే చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇటీవల ఈ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడమే కాకుండా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజెస్ ఫిలిం కేటగిరీలో కూడా ఒక అవార్డును తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా రాజమౌళి హాలీవుడ్ ఫ్యాన్స్ గురించి సైతం మాట్లాడారు.. ఆయన మాట్లాడుతూ..అందరూ ఫిలిం మేకర్స్ లాగే నేను కూడా హాలీవుడ్లో సినిమా చేయాలని భావించాను.. ఇండస్ట్రీలో సినిమాలో చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. ఇందుకు నాకు బలమైన సహకారం కావాలి.. కానీ భారతీయ సినిమాల ఫిలిం మేకింగ్ లో మాత్రం నాకు ఆ అవసరం లేదు.. నాకు నచ్చిన ప్రిన్స్ ఆఫ్ పర్షియా వీడియో గేమ్ సిరీస్ అనుగుణంగా దర్శకత్వం వహించాలని ఎంతో ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: