టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో రాశిఖన్నా కూడా ఒకరు. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన ఈమె తాజాగా ఒక సినిమా కోసం తాను ఎంత కష్టపడిందో తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈమెకి హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్నాయి అని చెప్పాలి. సినిమాలు చేయడం చేస్తుంది కానీ ఆ సినిమాలు మాత్రం పెద్దగా సక్సెస్ను అందుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం ఈమె స్టార్ హీరోల సరసన నటించి చాలా కాలం అయింది. అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం రాశిఖన్నా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అంతేకాదు ఆ వెబ్ సిరీస్ లో నటించేందుకు చాలానే కష్టపడుతుంది ఈమె. 

ప్రస్తుతం రాశి కన్నా సిద్ధార్థ మల్హోత్ర తో కలిసి యోధ అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాదు దీంతోపాటు షాహిద్ కపూర్ ,విజయ్ సేతుపతి మరియు అమోల్ పాలేకర్ తో కలిసి ఫర్ జీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అయితే ఇందుకోసం భారీ ఎత్తున కష్టపడుతోందట ఈ బ్యూటీ. ఇక ఫిబ్రవరి 10 నుండి ఈ సినిమా ఓటీడీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగానే  ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అనుభవాలను మీడియాతో పంచుకుంది. ఇందులో భాగంగానే ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది.. ఫేక్ కరెన్సీ నోట్స్ కు సంబంధించిన రహస్యాలను ఛేదించే ఆఫీసర్ గా నేను ఈ సినిమాలో మీకు కనిపిస్తాను...

అంతేకాదు ఈ పాత్ర రియాలిటీ కి చాలా దగ్గరగా ఉంటుంది.. మొదట ఈ సినిమా స్క్రిప్ట్ చదివేటప్పుడు నాకు నకిలీ మనీ చలామణి ఇలా ఉంటుందా అని షాక్ అయ్యాను.. ఇక ఈ విషయం తెలియని వారు ఈ సీరియస్ చూశాక తెలుసుకోవచ్చు.. ఈ సిరీస్ చూసినా అనంతరం మనకి నేరాలపై ఒక అవగాహన వస్తుంది..సాధారణంగా ఇలాంటి సినిమాలలో యాక్షన్ సీన్స్ లో నటించాలి అంటే చాలా ధైర్యం కావాలి.. శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉండాలి.. దానికి తగ్గట్టు చాలా కష్టపడాల్సి వస్తుంది.. దానికి తగ్గట్టుగానే వ్యాయామాలు కూడా నేను చేస్తున్నాను అంటూ చెప్పకు వచ్చింది రాశిఖన్నా. ఇక యాక్షన్ సీన్స్ లో నటించినందుకు ఆ సమయంలో ఎంత కష్టపడుతున్నానో కూడా తెలియకుండా చేస్తూ ఉంటున్నాను. జిమ్ లోనే దాదాపు 5 నుండి 6 గంటల వరకు కసరత్తులు చేస్తూ ఉంటున్నాను. ఈ సినిమా కోసం నేను మనసుపెట్టి కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది రాశి కన్నా..!!

మరింత సమాచారం తెలుసుకోండి: