వాల్తేరు వీరయ్య సినిమాతో మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన నుంచి ఖైదీ నెంబర్ 150 తరువాత అసలైన బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు వాల్తేరు వీరయ్య సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ ని ఇచ్చారు మెగాస్టార్.తాజాగా ఈ సినిమా ఏకంగా 200 కోట్ల క్లబ్బులో చేరిపోయింది.కేవలం 11 రోజుల్లోనే ఈ ఘనత సాధించారు చిరంజీవి. వీరయ్య సినిమా విజయంలో రవితేజ పాత్ర కూడా అసలు మరిచిపోలేనిది. ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది ఈ సినిమా.రీ ఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ చిరంజీవి నుంచి లాభాల పరంగా వచ్చిన అతిపెద్ద బ్లాక్‌బస్టర్ సినిమా వాల్తేరు వీరయ్య కావడం విశేషం. 90 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఇప్పటికే 200 కోట్ల దాకా వసూలు చేసింది. ఇదిలా ఉంటే చిరంజీవి 200 కోట్ల క్లబ్బులో చేరడం ఇది మొదటిసారి. 2019లో విడుదలైన సైరా 186 కోట్లు మాత్రమే వసూలు చేసింది.


అయితే బిజినెస్ ఎక్కువగా చేయడంతో.. ఈ సినిమా లక్ష్యానికి  దూరంలో ఆగిపోయి ప్లాప్ అయ్యింది.మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్‌ కూడా రెండుసార్లు 200 కోట్ల క్లబ్బులో చోటు సంపాదించారు. నాలుగేళ్ళ కింద రంగస్థలంతో మొదటిసారి డబుల్ సెంచరీ కొట్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పుడు పెద్ద సంచలన విజయం సాధించింది. ఇక గతేడాది రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 200 కోట్లేంటి 1200 కోట్లు వసూలు చేసింది.అయితే ఇందులో ఎన్టీఆర్ మరో స్టార్ హీరోగా నటించారు.అయితే ఎక్కువ 200 కోట్లు నమోదు చేసిన సినిమాల రికార్డు సూపర్ స్టార్ మహేష్ బాబు పేరిట ఉంది. మహేష్ బాబు ఏకంగా 4 సినిమాలతో ఈ రికార్డు అందుకొని టాప్ లో దూసుకుపోతున్నారు.ఇప్పుడు చిరంజీవి కూడా యంగ్ హీరోస్ లాగా ఇలా 200 కోట్లు కలెక్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.ఇక ఈ వారం తరువాత ఈ సినిమా సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: