
ఇలా అప్ కమింగ్ డాన్సర్లందరికీ కూడా ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ షోలో ఎన్నో సీజన్ల నుంచి శేఖర్ మాస్టర్ జడ్జిగా కొనసాగుతూ వస్తున్నారు. తనతైన జడ్జిమెంట్తో ప్రేక్షకుల మన్ననలు కూడా పొందుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే జడ్జి సీట్లో కూర్చున్న వారు ఇక ఏం జడ్జిమెంట్ చెప్తే అది ఫైనల్ గా ఉంటుంది. కానీ ఢీ 15వ సీజన్లో మాత్రం కొరియోగ్రాఫర్లు కూడా ఒక పర్ఫామెన్స్ పై తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు అవకాశం కల్పించారు.
ఈ క్రమంలోని ఇటీవల కన్నా అనే కొరియోగ్రాఫర్ ఇక మరో కొరియోగ్రాఫర్ చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పర్ఫామెన్స్ లో మ్యాజిక్ మిస్ అయింది అంటూ మాట్లాడాడు. అయితే అంతకుముందు అదే పర్ఫామెన్స్ ని జడ్జిలు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. దీంతో శేఖర్ మాస్టర్ సీరియస్ అయ్యాడు. ఆ పర్ఫామెన్స్ లో ఏం తక్కువయింది
ఇంతకుముందు నువ్వు చేసిన పర్ఫామెన్స్ లో ఏమైనా కొత్త స్టెప్స్ ఉన్నాయా.. ఒకరిని అనే ముందు నీది నువ్వు చూసుకో అంటూ ఇక అతనికి వార్నింగ్ ఇచ్చాడు శేఖర్ మాస్టర్. ఇక ఆ తర్వాత కన్నా నువ్వు ఎలిమినేట్ అయ్యావు అంటూ ఆ కొరియోగ్రాఫర్ ని బయటికి పంపించడం ప్రోమోలో కనిపిస్తుంది.