బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

పఠాన్ : ఈ మూవీ లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటించగా ... బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం ఈ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. విశాల్ - శేఖర్ సంగీతం అందించిన ఈ మూవీ కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను జనవరి 25 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు 55 కోట్ల కలెక్షన్లను బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చేస్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

కే జి ఎఫ్ చాప్టర్ 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 53.95 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

వార్ : హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 51.60 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు.

దక్ష ఆఫ్ హిందుస్థాన్ : అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 50.75 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు.

హ్యాపీ న్యూ ఇయర్ : షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ఫరా ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల మొదటి రోజు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 42.62 కోట్ల కలెక్షన్ వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: