తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ మరికొన్ని రోజుల్లో తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిపోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా విజయ్ కెరియర్ లో 67 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఈ మూవీ ని తలపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర బృందం తెరకెక్కించబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరొక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మూవీ లో తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న చియాన్ విక్రమ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు , విక్రమ్ పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో విజయ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ పాత్ర హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే విజయ్ ... లోకేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్టర్ మూవీ తెరకెక్కి బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తదుపరి మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: