తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి తళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వం లో రూపొందుతున్నటువంటి మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది . ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్.లో మాస్టర్ మూవీ తేరకెక్కి మంచి విజయం అందుకుంది. దానితో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు టైటిల్ ను ఈ మూవీ యూనిట్ ఫిక్స్ చేయలేదు.

దానితో విజయ కెరీర్ లో ఈ సినిమా 67 వ మూవీ గా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ షూటింగ్ ను ఈ సినిమా యూనిట్ తలపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో జరుపుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ మూవీ యొక్క టైటిల్ ను అనౌన్స్ చేయనున్నట్లు తాజాగా ఈ సినిమా బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ చిత్రీకరణ దశలో ఉండగానే ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. 

అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే భారీ క్రేజ్ ఉన్న ఈ మూవీ లో విజయ్ సరసన అందాల ముద్దు గుమ్మ త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  అనిరుధ్ రవిచంద్రన్ ఈ క్రేజీ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: