బుల్లితెరపై ఒకప్పుడు స్టార్ యాంకర్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు యాంకర్ రవి. రవి తో పాటు యాంకర్ ప్రదీప్ కూడా అదే స్థాయిలో మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు. అప్పట్లో వీరిద్దరూ పోటాపోటీగా కార్యక్రమాలలో కూడా పాల్గొనేవారు.యాంకర్ రవి కెరియర్ ఆరంభంలో యాంకర్ లాస్యతో కలిసి ఎక్కువ కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతేకాదు వీరిద్దరి జోడి బాగుండడంతో వీరిద్దరికీ మంచి గుర్తింపు కూడా లభించింది. ఇక ఆక్రమంలోనే వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని ప్రేమలో ఉన్నారు అంటూ రకరకాల పుకార్లు సోషల్ మీడియా వేదికగా రావడం జరిగింది.ప్రస్తుతం వీరిద్దరూ వేరువేరు వివాహాలు చేసుకుని తమ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు. 

మొదట వీరిద్దరి పెళ్లి విషయం బయట పెట్టకుండా యాంకర్ గా వ్యవహరించారు. అనంతరం రవి ప్రేమ విషయం బయటపడడంతో లాస్య రవికి దూరమైంది. కొన్నాళ్ల తర్వాత ఆమె పెళ్లి కూడా చేసుకోండి అనంతరం కొన్నాళ్లపాటు యాంకర్ రవి కెరియర్ సాఫీగా సాగింది.ఇక అలాంటి సమయంలో యాంకర్ రవి తన భార్య మరియు బిడ్డలను పరిచయం చేయడం జరిగింది. బుల్లితెరపై తన భార్య బిడ్డలతో సందడి చేశాడు రవి. తన మాటలతో ఎప్పుడూ అందరినీ అలరించే రవి చాలా విషయాలకు గాను అనేక విమర్శలను ఎదుర్కొన్నాడు. అంతేకాదు రవి ఎదుటివారిని చాలా తక్కువ చేసి మాట్లాడుతాడు అన్న నేపథ్యంలో యాంకర్ రవి ఉన్న కార్యక్రమాన్ని చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు.

 అయితే ఈ కారణంగానే చాలామంది ప్రోగ్రాం ప్రొడ్యూసర్లు యాంకర్ రవిని ఒక షో కి యాంకర్ గా పిలవాలి అంటే భయపడుతున్నారట.ఇందుకు గాను యాంకర్ రవి కోసం అనుకున్న కార్యక్రమాలను మరో యాంకర్ తో చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే స్టార్ మా మరియు ఈటీవీ కార్యక్రమాలలో యాంకర్ రవి అసలు ఎక్కడ కూడా కనిపించడం లేదు.అయితే తాగాగా బుల్లితెర వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ప్రదీప్ తో పోలిస్తే యాంకర్ రవి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు అని.. అత్యంత దారుణమైన కెరియర్ను ప్రస్తుతం రవి అనుభవిస్తున్నాడు అంటూ అంటున్నారు. అంతేకాదు యాంకర్ ప్రదీప్ తో పోలిస్తే యాంకర్ రవి రెమ్యూనరేషన్ చాలా తక్కువ అని కూడా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే యాంకర్ రవి మళ్ళీ షోలలో కనిపిస్తాడా లేదా అని చాలామంది ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: