
నేషనల్ క్రష్ గా మంచి పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా కు కూడా అలాంటి వ్యాధి ఉంది అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ హల్ చల్ చేస్తుంది. కిరిక్ పార్టీ అనే సినిమాతో మొదటి సారి సినిమా తెర కి పరిచయమైన రష్మిక ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ అయింది.. అంతేకాదు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ కూడా అయింది. రష్మిక కి ప్రతి రోజు డైరీ రాసుకునే అలవాటు కూడా ఉంటుందట..ఇదే సమయంలో ఆమె ఏ పని చేసినా కానీ ప్రతిరోజు కూడా డైరీ లో రాస్తుందట.
సోమవారం కూడా ఆమె ఏమేం పనులు చేసిందో అవన్నీ కూడా రాసుకుందట.అందులో ఏముందంటే మార్నింగ్ లేచాను లేచిన వెంటనే కార్డియో ఎక్సర్సైజ్ ను చేశాను.ఆ తర్వాత కొంచెం అన్నం తిని రేపు ఏం చేయాలో అవన్నీ కూడా సర్దుకున్నాను. ఆ తర్వాత నేను బయటికి వెళ్దాం అనుకుంటే ఆర్నా మరియు స్నోలు ఇద్దరు నన్ను బయటికి వెళ్లకుండా అడ్డుకున్నాయి. ఆ తర్వాత కొద్ది సేపటికి వర్కౌట్లు కూడా చేసి బ్రేక్ ఫాస్ట్ కూడా చేశాను.ఇక అదే టైంలో డెర్మట్ తో నాకు ఒక అపాయింట్మెంట్ వుంది.అలాగే ఓ ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది కానీ అది కాస్త క్యాన్సిల్ అయింది.
దాంతో రాత్రి అయింది ఇంటికి వచ్చి పడుకున్నాను అని రష్మిక చెప్పుకొచ్చిందట అయితే రష్మిక తన డైరీలో రాసుకున్న దాంట్లో డెర్మట్ అంటే డెర్మటాలజిస్ట్ అనీ రష్మికకు ఏమైనా చర్మసంబదిత వ్యాధి వచ్చింది కావచ్చు అందుకనే డాక్టర్ ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుంది అని చాలామంది కూడా భావిస్తున్నారట.