ఈ మధ్యకాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు వరుస వివాహాలు చేసుకుంటున్నారు.అంతేకాదు వారి వివాహాలపై కూడా సినిమాల రేంజ్ లో బజ్ ఏర్పడుతుంది.ఈ నేపథ్యంలోనే ఓటీటీల పుణ్యమా అని చాలామంది ప్రముఖుల పెళ్లి విశేషాలను సీరియస్ ల రూపంలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. గతేడాది కోలీవుడ్ దంపతులు నయనతార విఘ్నేశ శివన్ ల పెళ్లి కూడా అచ్చం ఇలాగే ఓటీటీలో ఎపిసోడ్ల రూపంలో విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరోసారి సౌత్ హీరోయిన్ హన్సిక వివాహాన్ని కూడా అదేవిధంగా స్ట్రిమింగ్ చేయాలని అనుకుంటున్నారు.

 డిసెంబర్ 4న తన బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది ఈమె. అయితే వీరి వివాహాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ డాక్యూ సిరీస్ ల రూపంలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్ను కూడా విడుదల చేయడం జరిగింది. లవ్ షాది ధర్మ పేరుతో దీన్ని విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో భాగంగానే హన్సిక తన పెళ్లి వ్యక్తిగత జీవితం గురించి ఒక విషయాలను పంచుకుంది. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ వీడియోలో తను తన పాత రిలేషన్షిప్ గురించి కూడా మాట్లాడింది. ఇక ఆ ట్రైలర్ను గమనిస్తే ప్రారంభంలోనే హన్సిక తన పాత రిలేషన్షిప్ గురించి ప్రస్తావిస్తూ వ్యక్తిగత జీవితం

 పరంగా తాను మరోసారి పబ్లిక్ దృష్టిలో పెడదల్చుకోలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన భర్త సోహైల్ తో తన ప్రేమ పెళ్లి విషయాన్ని చివరివరకు దాచుకుంటూ వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇక గతంలో తమిళ హీరో అయినా శింబుతో ఆమె రెండేళ్లపాటు డేటింగ్ లో ఉన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. వీరిద్దరూ తమ ప్రేమను పెళ్లి వరకు కూడా తీసుకెళ్దాం అని అనుకున్నారు. కానీ వివాహం అనంతరం హన్సిక సినిమాలో నటించకూడదని శింబు కుటుంబ సభ్యులు షరతు పెట్టడంతో ఆమె ఆ రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకున్నట్లుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే హన్సిక ఈ అంశంపై తన పెళ్లికి సంబంధించిన ఎపిసోడ్ లో భాగంగా పేర్కొంది. దీంతో శింబు ఫాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: