ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది స్టార్ హీరోలు ఇలా మల్టీస్టారర్లతోనే ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అటు దర్శక నిర్మాతలు కూడా మల్టీస్టారర్ అయితే ఇద్దరు హీరోల అభిమానుల నుంచి ఆదరణ దక్కుతుందని దీంతో యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉందని.. ఇక ఇలాంటి మల్టీస్టారర్ల వైపు అడుగులు వేస్తున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక అభిమానుల ఊహకందని క్రేజీ కాంబినేషన్లు కూడా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు టాలీవుడ్ లో పవర్ స్టార్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ సైతం ఇప్పటివరకు కొన్ని మల్టీ స్టారర్ సినిమాల్లో నటించాడు. అయితే ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో క్రేజీ మల్టీస్టారర్ చేయబోతున్నాడు అన్న వార్త మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేస్తుంది అని చెప్పాలి. ఇక ఇలా పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేయబోయే మరో స్టార్ హీరో ఎవరో కాదు తమిళ సూపర్ స్టార్ అయిన అజిత్.


 ఇటీవలే ఒక కన్నడ స్టార్ డైరెక్టర్ హీరో అజిత్ ను కలిసి మల్టీస్టారర్ సినిమాకు సంబంధించిన స్టోరీని వినిపించాడట. అయితే ఈ స్టోరీ అజిత్ కు కూడా ఎంతగానో నచ్చేసిందట. అయితే ఇక తనతో పాటు ఈ సినిమాలో మరో హీరోగా ఎవరిని అనుకుంటున్నారు అంటూ అజిత్ అడిగితే.. ఇక టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాడట సదరు దర్శకుడు. పవన్ కళ్యాణ్ తో సినిమా అనగానే అజిత్ కూడా ఎంతగానో సంతోషించాడు అన్న టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. మంచి కథతో ఎవరైనా నా దగ్గరికి వస్తే కచ్చితంగా చేస్తానంటూ గతంలో పవన్ కళ్యాణ్ కూడా బదులు ఇచ్చాడు. ఇక వీరిద్దరి మల్టీస్టారర్  నిజంగానే ఉంటుందేమో అని అభిమానులు అనుకుంటున్నారు. కానీ దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: