యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు.. ప్రెజెంట్ ఈయన భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్నాడు.ఏకంగా ఐదు పాన్ ఇండియన్ సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో 'సలార్', ఆదిపురుష్, మరియు ''ప్రాజెక్ట్ కే'' వంటి భారీ సినిమాలు ఉన్నాయి.. మరి ఈ సినిమాలను చేస్తూనే మారుతి దర్శకత్వంలో మరో హారర్ సినిమాను కూడా చేస్తున్నాడు.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాకు ఓకే చెప్పాడు అని తెలిసి అంతా కూడా షాక్ అయ్యారు.. భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఈయన దర్శకత్వంలో చేయడం ఏంటని కూడా అనుకున్నారు.. అయితే ఇది చిన్న సినిమా అని ఫాస్ట్ గా ముగించాలి అని భావించి ప్రభాస్ వెంటనే షూట్ కూడా స్టార్ట్ చేసి పూర్తి చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.. ఇది కూడా పాన్ ఇండియాలో రేంజ్ లో విడుదల కానుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి లేటెస్ట్ గా ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట.. ఎందుకంటే ఈయన రెమ్యునరేషన్ కంటే తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం.కాబట్టి ఈ బడ్జెట్ ను అంత కంటే పెంచకూడదు అనే ఉద్దేశంతో ప్రభాస్ రెమ్యునరేషన్ ను తీసుకోవడం లేదని తెలుస్తుంది... కానీ వచ్చే లాభాల్లో మాత్రం వాటా అయితే తీసుకుంటాడు అనే వార్త వినిపిస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ప్రెజెంట్ వర్కింగ్ టైటిల్ గా రాజా డీలక్స్ అనే పేరును అయితే పెట్టారు.. మారుతి ఈ సినిమాను కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు అని ఇదొక మాస్ మసాలా ఎంటర్టైనర్ అని కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు హీరోయిన్స్ కూడా నటించనున్నారు. ఇప్పటికే మాళవిక ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: