తెలుగు ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ అవసరం లేకుండానే ఇండస్ట్రీ లో పైకి రావొచ్చు అని చేసి నిరూపించిన హీరోల్లో ఒకరు మన మాస్ మహారాజ్ రవితేజ. ఇటీవల ఆయన దశ తిరిగి పోయిందనే చెప్పాలి వరుస డిసస్టర్ లతో ఎదురుదెబ్బలు తగులుతున్న రవితేజకి ఇపుడు వరుస హిట్స్ పడుతున్నాయి. అందులో భాగంగానే రవితేజ, సుధీర్‌ వర్మ కాంబో లో అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌ టి టీమ్‌వర్క్స్‌పై తెరకేక్కుతున్న  ఎంగేజింగ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'రావణాసుర'. ఈ మూవీ తో ప్రేక్షకుల్ని థ్రిల్‌ కి గురి చేయడానికి ప్రొడ్యూసర్స్ అభిషేక్‌ నామా, రవితేజ రెడీగా  ఉన్నారు.

ఐతే రవితేజ బర్త్డే రోజున రావణాసుర ను డిఫరెంట్‌ షేడ్స్‌లో చూపించే ఒక గ్లింప్స్‌ రిలీజ్  చేయడంతో ప్రమోషన్లను స్టార్ట్ చేసారు సినిమా  మేకర్స్‌.ఐతే
ఇటీవల హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్వరపరిచిన ఒక థీమ్‌ సాంగ్‌ను కూడా రిలీజ్  చేయడంతో మ్యూజిక్‌ ప్రమోషన్‌లు కూడా స్టార్ట్‌ అయ్యాయి అని చెప్పాలి. ఐతే ఇది ఒక మంచి ప్లేస్ సాధించింది అని చెప్పాలి.ఎలక్ట్రిఫైయింగ్‌, వైబ్రెంట్‌ ట్రాక్‌ మ్యూజిక్‌ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది.
హర్షవర్ధన్‌ రామేశ్వర్‌తో పాటు భీమ్స్‌ సిసిరోలియో ఈ సినిమా కి మ్యూజిక్  అందించారు. లేటెస్ట్ గా మేకర్స్‌ రెండవ సింగిల్‌ 'ప్యార్‌ లోన పాగల్‌' లిరికల్‌ వీడియోను ఈనెల పద్దెనిమిది న రిలీజ్ చేయనున్నట్లు ఆఫీషల్ ఎనౌన్స్‌మెంట్ చేశారు.దీంట్లో షేడ్స్‌తో బ్లాక్‌ అవుట్‌ ఫిట్‌ ధరించిన రవితేజ పోస్టర్‌లో అల్ట్రా-స్టైలిష్‌గా కనిపిస్తు గ్రేస్‌ ఫుల్‌ డ్యాన్స్‌ మూమెంట్‌తో ఆకట్టుకున్నారు.

సుధీర్‌ వర్మమూవీ లో రవితేజను లాయర్‌ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌లో చూపించాబోతున్నారట. శ్రీకాంత్‌ విస్సా ఈ మూవీ కి సరికొత్త కథని అందించారు. సుధీర్‌ వర్మ తన మార్క్‌ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకేక్కిస్తున్నారు.ఇందులో
సుశాంత్‌ ఒక కీలక పాత్ర కూడా పోషిస్తున్నారు.ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్‌, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా చేస్తున్నారు. అలాగే దీనికి విజరు కార్తీక్‌ కన్నన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రీకాంత్‌ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఐతే ఏప్రిల్‌ నెలలో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: