టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు పొందిన ఒకప్పటి హీరో నవదీప్ అందరికి తెల్సినవాడే. చందమామ, గౌతమ్ ఎస్ఎస్సి వంటి మూవీస్ లలో హీరోగా చేసి ఆడియన్స్ కి బాగా దగ్గర అయ్యాడు.ఆ తరువాత హీరోగా మంచి ఛాన్సెస్ రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆర్య , అలా వైకుంఠపురం వంటి మూవీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెయిన్  పాత్రలలో చేసాడు.

ఐతే ప్రెసెంట్ తాను అప్పుడప్పుడు మూవీస్ లలో చేస్తూ తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆయనతో కలిపి ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలందరూ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

లేటెస్ట్ గా నవదీప్ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక అమ్మాయి హాండ్స్ కు  గోరింటాకు పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ లో  మెరిసిపోతున్న ఉంగరం పెట్టుకొని,రైట్ హ్యాండ్తో పేస్ కనిపించకుండా దాచుకున్నట్లు ఉన్న ఫోటోని ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేస్తూ వాలంటైన్స్ డే స్పెషల్ అంటూ ఖుషి అహుజా అన్న అకౌంట్ ని టాగ్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దాంతో  ఆ అమ్మాయి ఎవరా అని తెల్సుకునే పనిలో పడ్డారు నేటిజన్లు. ఐతే అపుడు బయట పడింది ఏంటంటే నవదీప్ అందరిని ప్రాంక్ చేసాడట. ఆ అమ్మాయి వివరాలు గురించి తెలుసుకోవటానికి ఆ అకౌంట్ ఓపెన్ చేయగానే  చూసింది చాలు ఇక కూర్చో అని మీనింగ్ వచ్చే విధంగా ఉందట.ఐతే ఈ సంగతి గూర్చి నవదీప్ మోసం చేశాడంటూ ఒక నెటిజన్ వీడియో తీసి షేర్ చేశాడు.ఐతే ఓవర్ అల్ గా తన పోస్ట్ తో నవదీప్ అందరినీ ఫూల్స్ చేశాడు. ఆయనతో సమానంగా ఉన్న హీరోలు అందరూ పెళ్లిళ్లు చేసుకున్నారు నవదీప్ మాత్రం ఇంకా చేసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: