షారుఖ్ పై FIR.. వద్దని  షారుఖ్ రిక్వెస్ట్ ?

బాలీవుడ్‌ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.తను లేటెస్ట్ గా నటించిన పఠాన్ సినిమాకు వస్తోన్న కలెక్షన్లు చూసి బాలీవుడ్ కూడా గాల్లో తేలిపోతోంది.బాలీవుడ్‌కు మళ్లీ పూర్వ వైభవం వచ్చిందని వారు సంబరపడిపోతోన్నారు. అయితే బాలీవుడ్, షారుఖ్‌ ఖాన్‌కు కమ్ బ్యాక్‌లా కలిసి వచ్చిన పఠాన్ సినిమా అక్కడ సరి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించింది ఈ సినిమా. పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఫుల్ ఫాంలోకి వచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అవుతున్నాడు. ఇప్పటికే ట్విట్టర్‌లో చాలా సార్లు షారుఖ్ ఖాన్ తన అభిమానులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు. #ASKSRK పేరిట ఎన్నో సార్లు చిట్ చాట్ కూడా చేశాడు. తన అభిమానులకు తన స్టైల్లో సమాధానాలు ఇచ్చాడు.


ఇప్పుడు కూడా షారుఖ్ అదే పని చేశాడు. అయితే ఈసారి చాలా ఫన్నీగా పెట్టాడు. ఏ విషయాలైనా అడగండని, కానీ పర్సనల్‌ వెళ్లొద్దని, బూతులు వద్దని ఇంకా నెగెటివ్ వద్దని వేడుకున్నాడు. అయితే నెటిజన్లు మాత్రం షారుఖ్‌ను సరదాగా ఆట పట్టించే ప్రశ్నలు వేశారు.ఓ నెటిజన్ షారుఖ్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఇలా అన్నాడు ఇంత ఫిట్ గా ఉండి మీరు 57 ఏళ్లు అని తప్పుగా చెబుతున్నారు.. ఇలా అబద్దాలు చెబుతున్నందుకు మీ మీద ఎఫ్‌ఐఆర్ ని నమోదు చేయాలి అని అన్నాడు.అందుకు షారుఖ్ ప్లీజ్ వద్దు నా మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకండి.. నా వయసు ఇంకా 30 ఏళ్లే.. అందుకే జవాన్ అనే సినిమాను చేస్తున్నాను.. అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి షారుఖ్‌ మాత్రం తన అభిమానులతో ఇలా సరదాగా ట్విట్టర్లో టైం పాస్ చేసేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: