ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎంట్రీ ఇచ్చింది.అనంతరం అక్కడే సెటిల్ అయ్యింది రకుల్. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె సరైన సక్సెస్ను అందుకోలేకపోయింది. సినిమాల విషయం పక్కన పెడితే గత కొంతకాలంగా తనపై రకరకాల రూమర్లు వస్తున్నాయి ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన రూమర్లు రకుల్ ప్రీత్ సింగ్ పై ఎక్కువయ్యాయి అని చెప్పాలి. అయితే తాజాగా వాటిపై స్పందించింది రకుల్ ప్రముఖ ప్రొడ్యూసర్ జాకి భగ్నాని తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా రకుల్ గ తేడాది స్పష్టం చేసింది .

అప్పటినుండి వీరిద్దరూ కలిసి చట్టపట్టలేసుకుంటూ ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ మీడియా కంట పడుతున్నారు. ఈ క్రమంలోనే వారు కలిసి తిరగడం చూసిన చాలామంది రకుల్ తన ప్రియుడితో వివాహానికి సిద్ధమయింది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై రకుల్ సోదరుడు ఆయాన్ సోషల్ మీడియా వేదికగా తన అక్క వివాహం గురించి వెల్లడించడంతో ఆ వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నవంబర్ నెల లేకపోతే అక్టోబర్ నెలలో వివాహం జరిగింది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి.. తాజాగా ఈ విషయాలపై స్పందించిన రకుల్.. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతి వారం నా గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది..

అయితే ఇలా ప్రతివారం వస్తున్న వార్తల ప్రకారం చూస్తే తేడాది నవంబర్లోనే నాకు పెళ్లి అయింది.. పెళ్లి అయితే అయింది కానీ అసలు ఆ పెళ్లి ఎలా జరిగిందో మాత్రం తెలియదు.. అంటూ చెప్పుకు వచ్చింది.. అంతేకాదు కేవలం ఇప్పుడు తన ధ్యాసంతా సినిమాలపైనే ఉంది అని క్లారిటీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.. ఇన్నాళ్ళకి రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లిపై వస్తున్న రూమర్లకి చెక్ పెట్టడంతో ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: