కరోనా వచ్చిన తర్వాత నుండి సినిమాల బడ్జెట్లో కట్టడి చేయాలని.. టాప్ స్టార్ల పారితోషకాలను కూడా అదుపులో పెట్టాలని ఇటీవల ప్రొడ్యూసర్స్ గిల్డ్ పెద్దలు చాలా సందర్భాలలో వెల్లడించారు. అనంతరం కరోనా తర్వాత నుండి పారితోషకాలు తగ్గించుకోవాలని స్టార్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పిన స్టేట్మెంట్లు ఇప్పుడు నీటి మీద రాతలే అని తేలిపోయాయి. ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోలు 50 నుండి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ను తీసుకుంటున్నారని చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ జాబితాలో ముందుగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు ,అల్లు అర్జున్ రామ్ చరణ్, ఇలాంటి స్టార్ హీరోలో ఉన్నారని తెలుస్తోంది. 

అయితే ప్రభాస్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కొన్ని సినిమాలకు 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ను తీసుకుంటున్నారని అంటున్నారు. దాని అనంతరం ఆ స్థాయిలో పారితోషకం తీసుకుంటున్న హీరోగా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు కూడా లైన్లో పెట్టాడు పవన్ థేరి ఆధారంగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చేయనున్నాడు పవర్ స్టార్. ఇక దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.అంతేకాకుండా సహో ఫేమ్ సుజిత్ తో  కూడా ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటూ పవన్ మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడని

ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఎన్ని సినిమాలు లైన్ లో ఉండగానే తాజాగా మరొక రీమిక్స్ సినిమా కూడా చేసే దిశగా వెళుతున్నాడు పవన్.తమిళంలో సముద్రఖని నటించిన వినోదయ సీతం సినిమాకి రీమేక్ ఇది. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ మరుగు కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాలో కేతికాశర్మ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజులు కేటాయించాడని తెలుస్తోంది.ఇక కేవలం 20 రోజులకే 80 కోట్ల పారితోషకాన్ని పవన్ కళ్యాణ్ అందుకుంటున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.అయితే ఈ లెక్కన చూస్తే పవన్ ఒక్కరోజు రెమినరేషన్ 4 కోట్ల అన్నమాట. ప్రస్తుతం పవన్ తీసుకుంటున్న రెమ్యూనికేషన్ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: