అనుకున్నట్టుగా సెట్స్ మీదకు వెళ్తే ఈ సమ్మర్ కి పుష్ప 2 వచ్చేది. కానీ పుష్ప 2 ఈ ఏడాది కష్టమే అని తెలుస్తుంది. ఇప్పటివరకు సెకండ్ పార్ట్ షూటింగ్ చాలా తక్కువ జరిగినట్టు తెలుస్తుంది. ఓ పక్క సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అర్జున్ కూడా సుకుమార్ ని మరీ తొందర పెట్టకూడదని ఫిక్స్ అయ్యాడు. పుష్ప 1 బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు పార్ట్ 2 పై అక్కడ ఆడియన్స్ కి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వాటిని అందుకునేలా సినిమా ఉండాలి.

అందుకే సుకుమార్ అండ్ టీం బాగా కష్టపడుతుంది. పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్ ప్రతిదీ చాలా పఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారట. అసలు సినిమా సెకండ్ పార్ట్ లోనే అని చెబుతుండగా ఈ పార్ట్ 2 మరింత ఆసక్తికరంగా మలిచేందుకు సుక్కు ప్రయత్నిస్తున్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్ విషయంలో కూడా అసలు తొంద లేకుండా నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పుష్ప 2 అసలైతే ఈ ఏడాది సమ్మర్ కి రిలీజ్ అవ్వాల్సింది కానీ సెట్స్ మీదకు వెళ్లడం లేట్ అయ్యింది. సో ఎలా చూసినా ఈ ఏడాది రిలీజ్ కష్టమే కాబట్టి 2024 సంక్రాంతికి అనుకున్నా అప్పుడు ఆల్రెడీ సినిమాలు రిలీజ్ లు ఫిక్స్ అయ్యాయి.

అందుకే పుష్ప 2 ని 2024 సమ్మర్ కే రిలీజ్ అనుకుంటున్నారు. ఇప్పటికే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ఖర్చీఫ్ వేశాడు ఎన్.టి.ఆర్. కొరటాల శివ డైరెక్షన్ లో సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేశారు. సో సమ్మర్ కి తారక్ వస్తుండగా అల్లు అర్జున్ కూడా తన స్టామినా చూపించడానికి వస్తున్నాడు. పుష్ప 1 ఆల్రెడీ సెన్సేషనల్ హిట్ అయ్యింది కాబట్టి పుష్ప 2 అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ పాత్ర ఇంకాస్త టిపికల్ ఆ అదరగొట్టబోతుందని తెలుస్తుంది. రష్మిక మందన్నతో పాటుగా స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటుందని టాక్.  


మరింత సమాచారం తెలుసుకోండి: