బాలీవుడ్ స్టార్ హీరోస్ అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా నటించిన సెల్ఫీ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే ఈ సినిమాకు కేవలం మూడే మూడు కోట్ల కలెక్షన్స్ మాత్రమే రావడం బాలీవుడ్‌లో ఇప్పుడు పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. నేషనల్ మల్టీప్లెక్స్‌లలో శుక్రవారం నాడు సెల్ఫీ సినిమాకు కేవలం కోటిన్నర వసూళ్లు మాత్రమే వచ్చాయి.అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమాకు మూడు కోట్ల కలెక్షన్స్ రావడం బాలీవుడ్ వర్గాలను తల దించుకునేలా చేస్తుంది. అక్షయ్ కెరీర్‌లో తొలిరోజు అతి తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాగా సెల్ఫీ సినిమా నిలిచింది. బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్‌తో పాటు అక్షయ్‌కుమార్ గత సంవత్సరం నటించిన ఆరు సినిమాలు కూడా చాలా దారుణమైన డిజాస్టర్స్‌గా నిలిచాయి.ఆ ప్రభావం సెల్ఫీ సినిమాపై పడినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


అందువల్లే వసూళ్లు ఇంతలా భారీగా తగ్గినట్లు పేర్కొంటున్నారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన సెల్ఫీ సినిమాకు రాజ్ మెహతా డైరెక్షన్ వహించాడు. ఓ సినిమా స్టార్‌కు ఆర్‌టీఓ అధికారికి మధ్య నెలకొన్న ఈగో సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సూపర్ స్టార్ విజయ్ కుమార్ పాత్రలో నటించగా ఆర్‌టీఓ ఆఫీసర్‌గా బాలీవుడ్ సీరియల్ కిల్లర్ ఇమ్రాన్ హష్మీ కనిపించాడు. డయానాపెంటీ ఇంకా నుష్రత్ బరుచా హీరోయిన్లుగా నటించారు. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఓ స్పెషల్ సాంగ్‌లో పిచ్చ హాట్ గా నటించింది. మలయాళంలో విజయవంతమైన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా ఆధారంగా ఈ సెల్ఫీ తెరకెక్కింది.ఫైనల్ గా బాలీవుడ్ కి మరో రాడ్డులా మారి షెడ్డుకి వెళ్ళిపోయింది.ఇక కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ సినిమాతో చాలా గ్యాప్ తరువాత ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి మళ్ళీ సెల్ఫీ సినిమాతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి చుక్కలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: