
ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ తర్వాత ఎన్నో డిఫరెంట్ లవ్ స్టోరీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఎందుకో అనుకున్నంత స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పాలి. ఇక ఎన్నో ఫ్లాపుల తర్వాత గత ఏడాది సీతారామం అనే ఒక బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ సినిమా ద్వారా దర్శకుడు రేంజ్ కూడా ఒకసారి గా పెరిగిపోయింది అని చెప్పాలి.
ఈ సినిమా సూపర్ హిట్ అయిన వెంటనే మరో సినిమాను కూడా మొదలు పెట్టాలని అనుకున్నాడు దర్శకుడు హను రాగవపూడి. కానీ తదుపరి ప్రాజెక్టు విషయంలో మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు అన్నది తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ తో హను రాఘవపూడి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్లాన్ చేశాడు అని గతంలో ఇండస్ట్రీలో ఒక టాక్ చక్కర్లు కొట్టింది. కానీ అందులో నిజం లేదు అన్న విషయం మాత్రం తర్వాత క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఇక హను రాఘవపుడికి అడ్వాన్స్ ఇచ్చి ఒక మంచి కథను సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. మరోసారి తమిళ హీరోతోనే సినిమా చేసి పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టాలని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తుందట. దీన్నిబట్టి చూస్తే ఇక సీతారామం హిట్ తర్వాత హను రాగవపూడి మరో లక్కీ ఛాన్స్ కొట్టేసాడు అని చెప్పాలి.