
ఈ సినిమాతో మరొకసారి నటుడుగా ప్రశంశాలు అందుకున్నారు హీరో సుహాస్. ఇప్పటికే థియేటర్లో అలరించిన ఈ చిత్రం ఓటీటి లో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఓటిటి ప్లాట్ఫామ్ zee -5 లో ఈ చిత్రం డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఉగాది కానుకగా మార్చి 22వ తేదీన ఈ సినిమా ఓటీటైట్లో స్ట్రిమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సుహాస్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.
ఒక గ్రంథాలయంలో అసిస్టెంట్ లైబ్రరీగా పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటికైనా రైటర్ పద్మభూషణం అనిపించుకోవాలని పట్టుదల తో అందుకోసం ఇంట్లో వాళ్లకి తెలియకుండా లక్షల అప్పు చేసి తొలి అడుగు పేరుతో ఒక బుక్కు రాయిస్తారు..కానీ పాఠకులతో ఆ బుక్ చదివించడానికి ఎన్నో పాటుపడుతూ ఉంటారు ఆ తర్వాత పద్మభూషణ్ జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను ఎలా ఎదుర్కొంటారు అనే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం మొదటి రోజు నుంచి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నటుడు సుహాన్ మొదట పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎదిగారు. ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.