
ఇకపోతే ఇప్పుడు మార్చి 12వ తేదీన లాస్ ఏంజెల్స్ లో జరగనున్న 95 వ ఆస్కార్ వేడుకల సందర్భంగా ఈ వివరాలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. భారత తొలి ఆస్కార్ విజేతగా భాను అథైయా 1983లో నిర్వహించిన 55వ ఆస్కార్ వేడుకలలో ఆమె ఆస్కార్ పురస్కారాన్ని స్వీకరించి చరిత్ర పుటల్లో నిలిచారు.. 1982లో విడుదలైన గాంధీ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. 1992లో దర్శక దిగ్గజం సత్యజిత్ రే ఏ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత భారతీయులు ఆస్కారం అందుకోవడానికి దాదాపు 17 సంవత్సరాల సమయం పట్టింది. 2009లో జరిగిన 81వ ఆస్కార్ వేడుక ఆ లోటును భర్తీ చేయడం గమనార్హం.
అయితే ఈసారి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు ఆస్కార్ అవార్డులను భారతీయులు సొంతం చేసుకున్నారు. అందులోను ఒకే సినిమాకు అదే స్లమ్ డాగ్ మిలియనీర్.. ఈ చిత్రానికి గాను బెస్ట్ సౌండింగ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి , రిచర్డ్ ప్రైక్ , ఇయాన్ టాప్ తో కలసి ఆస్కార్ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది.. ఇక తర్వాత ఏఆర్ రెహమాన్ కూడా ఈ అవార్డును సొంతం చేసుకున్నారు