వయసు, హిట్టు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. రెండేళ్ల క్రితం ఆయన నటించిన ఆఖండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అనంతరం నందమూరి బాలకృష్ణ మరింత జోష్టో వరుస సినిమాలలో నటిస్తున్నాడు. ఆ ఉత్సాహంతోనే ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో హీరోగా నటించాడు.  సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కూడా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫలితంగా ఈ సినిమా ఆయన కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాగా కూడా నిలిచింది.

 ప్రస్తుతం బాలకృష్ణ తన 108 సినిమాను సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. వీర సింహారెడ్డి సినిమా తర్వాత ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ను మొదలుపెట్టి ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు బాలకృష్ణ .ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూల్ను జనవరి చివరివారం నుండి మొదలు పెట్టాల్సి ఉంది. ఇక తారకరత్న మరణం కారణంగా బాలకృష్ణ ఎలాంటి షూటింగ్లలో కూడా పాల్గొనలేదు. దీంతో ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే న్యూస్ ఎప్పుడో లీకై వైరల్ అవుతుంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణను ఢీకొట్టే విలన్ పాత్రలో ఎవరు నటిస్తారో అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి విలన్ పాత్రలో కనిపించనిందని తెలుస్తోంది. ఆమెతో బాలకృష్ణ ఫైట్ సీన్లు అద్భుతంగా ఉంటాయని కూడా తెలుస్తోంది .ఇదిలా ఉంటే ఇక బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. దాంతోపాటు యంగ్ సెన్సేషన్  శ్రీ లీల కూడా ఒక కీలకపాత్రలో నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: