మంచు మోహన్ బాబు కూతురు ప్రముఖ నటి గా.. హోస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి గురించి ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా మంచి లక్ష్మికి ఒక చేదు అనుభవం ఎదురైనట్లుగా తెలుస్తోంది .అయితే అది కూడా ఇండిగో ఫ్లైట్స్ సంస్థ కారణంగా అని తెలుస్తుంది .అయితే గతంలో అనసూయ ,హరిష్ శంకర్ ,రాణా వంటి వారు విమాన సంస్థల వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డ సంగతి మీ అందరికీ తెలుసు. ఫ్లైట్ ఆలస్యమై కొందరు ఫ్లైట్ ఎక్కే సమయంలో మాస్క్ వంటి విషయాలతో ఇబ్బంది పెట్టారు అని.. అంతేకాదు సీడ్స్ కూడా బాలేదు అంటూ ఒకచోట సీట్ బుక్ చేసుకుంటే మరొక చోట సీట్ ఇచ్చేవారు అంటూ చాలామంది సినీ సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా వేదిక గా  

వారి సమస్యలను బయటపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. రానా తన లగేజ్ విషయంలో ఇండిగో సంస్థ చాలా ఇబ్బంది పెట్టింది అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది .అయితే ఇటీవల ఎప్పుడో మంచు లక్ష్మి కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. మంచు లక్ష్మి సోమవారం తిరుపతి నుండి హైదరాబాద్కు రావడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన అనంతరం అనుకోకుండా తన బ్యాగును మర్చిపోయింది మంచు లక్ష్మి .ఈ క్రమంలోని మంచు లక్ష్మి తన సమస్యని సిబ్బందితో చెప్పింది. 40 నిమిషాల పాటు మంచు లక్ష్మి బయటే వెయిట్ చేసింది. ఈ క్రమంలోని ఈ విషయాన్ని తను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలి అని అనుకుంది .

కానీ మొదట తను ఇండిగో వారిని కాకుండా వేరే సంస్థను గురించి చెప్పింది. అనంతరం తను చేసిన తప్పుని తెలుసుకున్న మంచు లక్ష్మి తన పొరపాటును సరి చేసుకుని ఇండిగో సంస్థను తిరిగి టాగ్ చేసింది .ఆ సమయంలో మంచు లక్ష్మి 103 డిగ్రీల జ్వరంతో ఉంది అని.. అందుకే తన బ్యాగ్ ని కూడా తను మర్చిపోయింది అంటూ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొంది మంచి లక్ష్మి. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ నేను తిరుపతి నుండి హైదరాబాద్ రావడానికి అంత సమయం పట్టలేదు. కానీ గంటకు పైగానే ఎదురుచూసిన తన బ్యాగ్ ని తనకు ఇవ్వలేదని స్టాఫ్ ఒక్కరు కూడా దీనిపై స్పందించలేదు అని ఒక్క కస్టమర్ సర్వీస్ కూడా బాగాలేదు అని అసలు ఇండిగో సంస్థను ఎలా రన్ చేస్తున్నారు అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది మంచు లక్ష్మి. ఈ సందర్భంగా బ్యాన్ ఇండిగో అన్న హెయిర్ స్టైల్ ని కూడా జత చేసింది మంచు లక్ష్మి. ఇండిగో సంస్థ మంచు లక్ష్మి కి జరిగిన అసౌకర్యానికి గాను క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: