యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుండో ఎన్టీఆర్ 30 వ మూవీ కి సంబంధించిన అప్డేట్ ల కోసం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న విషయం మనకు తెలిసింది.  ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన అతి తక్కువ రోజుల్లోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 వ మూవీ రూపొంద బోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. దానితో ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆనందపడ్డారు.

అలా ఎన్టీఆర్ 30 వ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఎన్టీఆర్ 30 వ మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు మాత్రం ఇప్పటివరకు జరగలేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ గురించి కూడా చిత్ర బృందం చాలా రోజుల పాటు ఇలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించబోతుంది అంటూ ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఒక అద్భుతమైన న్యూస్ బయటకు వచ్చింది.

మూవీ యొక్క పూజా కార్యక్రమాలు ఈ నెల 18 వ తేదీన జరపడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెలలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా కోసం భారీ సెట్ లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా ... రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ మూవీ లోని యాక్షన్స్ సన్ని వేషాలను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లు కొరియో గ్రఫీ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: