బిగ్ బి అమితా బచ్చన్ గురించి ఆయన స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమితా బచ్చన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో అమితాబ్ సినిమాల్లో హీరో పాత్రల్లో నటించడం కంటే కూడా ఇతర ముఖ్య పాత్రలలో నటించడానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నాడు.

అందులో భాగంగా అమితా బచ్చన్ ప్రస్తుతం అనేక క్రేజీ సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే లో అమితాబ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా భాగం ఈ మూవీ చిత్రీకరణ కూడా పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. ఈ షెడ్యూల్ లో అమితాబ్ కూడా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు.

మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో అమితాబ్ కు గాయాలు అయ్యాయి. అయితే  హైదరాబాద్ లో చికిత్స అనంతరం అమితాబ్ ముంబై లో రెస్ట్ తీసుకున్నాడు. తాజాగా అమితాబ్ ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ లో తగిలిన గాయాల నుండి కోలుకుంటున్నట్లు వెల్లడించాడు. ఏదైనా ప్రమాదం జరిగిన టైమ్ లో ప్రతి మనిషికి కూడా రెండు ఛాయిస్ లు ఉంటాయి. ఒకటి ఇలా ఎందుకు జరిగింది అంటూ బాధపడుతూ కూర్చోవడం ... రెండవది ఎంత బాధ ఉన్నా దాన్ని తట్టుకొని దాన్ని అధిగమించడం. నేను రెండవ దాన్ని ఫాలో అయ్యాను. దీంతో ఎంత వేగంగా గాయమైందో అంత వేగంగా నయమవుతుంది అని అమితాబ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: