భారత సినీ ప్రేక్షకులు అందరూ కూడా నమ్మకం పెట్టుకున్నట్లుగానే జక్కన్న చెక్కిన త్రిబుల్ ఆర్ అనే కళ కండం విశ్వవేదికపై సత్తా చాటింది అన్న విషయం తెలిసిందే. త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు దక్కింది. దీంతో రాజమౌళి భారతీయులందరూ కూడా మీసం మెలివేసేలా చేశాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఆస్కార్  అవార్డుల ప్రధానోత్సవంలో అటు అంతర్జాతీయ వేదికపై త్రిబుల్ ఆర్ చిత్ర బృందం మొత్తం భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఎంతో ఆకట్టుకునే కాస్ట్యూమ్స్ లో సందడి చేశారు అని చెప్పాలి.  ముఖ్యంగా రామ్ చరణ్, ఉపాసన అయితే స్పెషల్ కాస్ట్యూమ్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు.



 రామ్ చరణ్ వస్త్రాలను ఫ్యాషన్ డిజైనర్స్ శాంతను, నిఖిల్ రూపొందించారు అన్నది తెలుస్తుంది. త్రిబుల్ ఆర్ లో ఆయన క్యారెక్టర్ ని దృష్టిలో పెట్టుకొని ఈ వస్త్రాలను డిజైన్ చేశారట. మెడాలియన్ బటన్స్, చక్రాలాంటి బ్రోచెస్ రామ్చరణ్ వేసుకున్న కాస్ట్యూమ్స్ కి స్పెషల్ అడిషన్ గా అనిపించాయి అని చెప్పాలి. అయితే మెగా పవర్ స్టార్ అంతర్జాతీయ వేదికపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు. ఆయన లుక్ కి విశ్వవ్యాప్తంగా ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్లు, సినీ ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు అని చెప్పాలి. రామ్ చరణ్ వేసుకున్న కాస్ట్యూమ్స్ ఇక భారత దేశంలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుకి అద్దం పట్టింది అని చెప్పాలి.


 కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు ఆయన సతీమణి ఉపాసన కాస్ట్యూమ్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇక ఉపాసన వేసుకున్న కాస్ట్యూమ్స్ ని జయంతి రెడ్డి డిజైన్ చేశారట. బినా గోయెంకా మెరుగులకు దిద్దిన లిలియం నెక్ పీస్ అటు ఉపాసన కాస్ట్యూమ్ లో అదనకు ఆకర్షణగా నిలిచింది అని చెప్పాలి. ప్రకృతిని పరిరక్షించాలని ఆలోచనతోనే ఉపాసన ఎప్పుడూ ఉంటుంది. భూమిని కలుషితం చేయకూడదని ఆమె సిద్ధాంతం. ఇక ఆమె ధరించిన యాక్ససిరీస్ లను కూడా స్క్రాప్ తో తయారుచేసిన హ్యాండ్ మేడ్  అని చెప్పాలి. అయితే ఇక ఈ నెక్ పీస్ డిజైన్ చేయడానికి దాదాపు 4 ఏళ్ళ సమయం పట్టిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: