మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న సమయం లోనే రాజకీయాల వైపు దృష్టి పెట్టి కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి మళ్ళీ ఖైదీ నెంబర్ 150 మూవీ తో తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై మెగా అభిమాను లతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 104.6 కోట్ల భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఆ తర్వాత చిరంజీవి "సైరా నరసింహా రెడ్డి" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 143.80 కోట్ల భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఆ తర్వాత చిరంజీవి "ఆచార్య" సినిమాలో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది.

మూవీ కి 48.36 కోట్ల కలెక్షన్ లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి 59.38 కోట్ల కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి "వాల్టేర్ వీరయ్య" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా137.85 కోట్ల కలెక్షన్ లను సాధించింది  ఇలా రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నటించిన ఆకరి 5 సినిమాలు కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లనే బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేశాయి. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఆఖరు 5 సినిమాల కెరీర్ గ్రేప్ ను గమనించినట్లు అయితే ఒక్కో సినిమా దాదాపుగా 98.79 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: