తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రి ఇచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అయిన వారు చాలా మందే ఉండగా.. మరి కొంతమంది ఫెయిల్యూర్ అయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో లైగర్ సినిమాలో నటించిన హీరోయిన్ అనన్య పాండే కూడా ఒకరు. తాజాగా అనన్య పాండే ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. అనన్య సోదరి అలన్నా పాండే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి మెహందీ వేడుకలు కూడా చాలా గ్రాండ్ గా జరిగినట్లు కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
పెళ్లి వేడుకకు కొంతమంది బాలీవుడ్ తారలు ఈవెంట్లో సందడి చేయడం జరిగిందట. ఈ పెళ్లి వేడుకలలో పింక్ కలర్ లెహంగాలు బ్లౌజ్ ధరించి ఎంతో అందంగా కనిపిస్తోంది హీరోయిన్ అనన్య పాండే. ఈ సందర్భంగా తన క్యూట్ స్మైల్ తో దిగినటువంటి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. చుంకి పాండే సోదరుడు చిక్కి పాండే కుమార్తెనే..ఆలన్నా. ఈమె తన బాయ్ ఫ్రెండ్ ఐవోర్ మెక్క్రేని వివాహం చేసుకోబోతోంది వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లుగా సమాచారం ఇప్పటికి వీరి నిచ్చితార్థం కూడా చేసినట్లు తెలుస్తోంది.ఇక సోషల్ మీడియాలో కూడా అలన్నా కు కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈమె బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాలి అంటే ఇతను కూడా ఒక దర్శకుడు అన్నట్లుగా తెలుస్తోంది. తన సోదరి పెళ్లిలో సందడి చేస్తున్న అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. మరి తెలుగులో మళ్లీ సినిమాలలో నటిస్తుందేమో చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ. లైగర్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనన్య పాండే ఎంతో కొంత అభిమానులను టాలీవుడ్ లో కూడా సంపాదించింది. ఇక అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్ ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: