కొన్ని రోజుల క్రితమే మసూద అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషమున అందరికీ తెలిసిందే. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో సంగీత , తిరువీర్ , కావ్య కళ్యాణ్ రామ్ , శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించగా  ... ఈ మూవీ కి సాయి కిరణ్ దర్శకత్వం వహించాడు. ప్రశాంత్ ఆర్. విహారి ఈ మూవీbకి సంగీతం అందించాడు. ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్ లు లభించాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని జెమిని టివి లో ప్రసారం చేశారు. ఈ మూవీ.కి బుల్లి తెర ప్రేక్షకుల నుండి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ 5.2 "టి ఆర్ పి" రేటింగ్ ను నమోదు చేయడం జరిగింది. చిన్న మూవీ కి ఈ రేంజ్ "టి ఆర్ పి" అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇలా ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: