ఎన్టీఆర్  ఇండస్ట్రీలో హీరోగా తారా స్థాయికి ఎదిగారు.. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారటా..

ముఖ్యంగా ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన వారు ఎన్టీఆర్ నటన అలాగే తన డాన్సుల గురించి మాట్లాడుతూ తనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే నటుడు శుభలేఖ సుధాకర్  గతంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈయన ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేత సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా సమయంలో ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు అయితే ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ను అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసించారు. షూటింగ్ లొకేషన్ లో ఎప్పుడూ కూడా అందరితో ఎంతో సరదాగా ఉండే ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా పేపర్ పట్టుకుని డైలాగులు చదవడం నేను చూడలేదని తెలిపారు.మరి ఆయన ఎప్పుడు చదువుతాడో ఏమో తెలియదు కానీ టేక్ అనగానే మూడు నాలుగు పేజీల డైలాగ్ అయినా కూడా సింగిల్ టేక్ లో చెప్పే టాలెంట్ ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చాడు.ఇలా ఎన్టీఆర్ ను కనుక చూస్తే ఆయన కెమెరా కోసమే పుట్టారెమో అనిపిస్తుంది.సినిమా పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి, కసి, కృషి వల్లే ఇదంతా సాధ్యమవుతుందేమోనని  కూడా ఈయన తెలిపారు.ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్పాలంటే ఆయన అద్భుతమైన వ్యక్తి అంటూ ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: