టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ ఏవో ప్రస్తుతం తెలుసుకుందాం.

అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన దంగల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1958 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. దర్శకధీయుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1810 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రభాస్ హీరో గా రూపొందిన ఈ మూవీలో అనుష్క , తమన్నా హీరోయిన్లుగా నటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1236.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ మూవీ జపాన్ దేశంలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబడుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1233 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన పటాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1048 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లభిస్తున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బజరంగీ భాయిజాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 870 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 831 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. అమీర్ ఖాన్ హీరో గా రుపొందిన పీకే మూవీ ప్రపంచవ్యాప్తంగా 741 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో 2.0 సినిమా ప్రపంచవ్యాప్తంగా 709 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన సుల్తాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 615 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: