హాస్య సినిమాలకు చిరునామాగా కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్న రాజేంద్రప్రసాద్ మంచినటుడు మాత్రమే కాకుండా మంచి హాస్య ప్రియుడు కూడ. సందర్భాన్ని బట్టి అతడు వేసే జోక్స్ సెటైర్స్ తో షూటింగ్ స్పాట్ ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది అని అతడితో నటించిన అనేకమంది నటీనటులు చెపుతూ ఉంటారు.


లేటెస్ట్ గా రాజేంద్రప్రసాద్ సీనియర్ నరేష్ తో కలిసి నటించిన ‘అన్నీ మంచి శకునములే’ మూవీ వచ్చేనెల విడుదలకాబోతోంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ సమ్మర్ కామెడీ స్పెషల్ గా ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ ఈమధ్యన జరిగింది. ఈ ఫంక్షన్ కు సీనియర్ నరేష్ పంచె కట్టుకుని డిఫరెంట్ లుక్ లో వచ్చాడు.


ఈమధ్యనే నరేష్ పవిత్రను పెళ్ళి చేసుకున్నట్లుగా ఒక వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈవీడియో మీడియాకు హాట్ టాపిక్ గా మారి దానిపై అనేక చర్చలు కూడ జరిగాయి. ఇది నిజం పెళ్లా సినిమా పెళ్లా అనే విష‌యంలో అన్న సందేహాలు కూడ వచ్చాయి. ఇప్పటికే నరేష్ కు మూడు పెళ్ళిళ్ళు జరగడంతో అతడి నాలుగో పెళ్ళి అంటూ కొందరు జోక్స్ కూడ వేసారు.


ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న ఒక యాంకర్ ‘రెండు క‌త్తులు ఒక ఒర‌లో ఇమ‌డ‌వంటారు.. కానీ మీరు, న‌రేష్ క‌లిసి ఈ సినిమాలో న‌టించారు.. దీనిపై మీరేమంటారు అని అడిగింది’. దానికి రాజేంద్రప్రసాద్ డిఫరెంట్ గా స్పందిస్తూ ”నేను క‌త్తి కాదు. న‌రేష్ క‌త్తి. నేను ఒర‌. వాడు మామూలోడు కాదు. మీ అంద‌రికీ తెలుసు. ఎప్పుడూ పెళ్లి కొడుకు లాగానే ఉంటాడు” అంటూ జోక్ చేయడంతో ఆ జోక్ కు ఆ ఈవెంట్ కు వచ్చిన వారంతా తెగ నవ్వుకున్నారు. మరొకసారి రాజేంద్రప్రసాద్ ఎవరినైనా తన మాటలతో టార్గెట్ చేయగలను అని నిరూపించుకున్నాడు అని అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: