ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా ఎన్ని రికార్డులు బద్దలయ్యయో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అవార్డులు వచ్చాయో, ఇండియన్ సినిమా ఎంత మంచి పేరు సాదించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ జనరేషన్లో బిగ్గెస్ట్ మాస్ హీరోల్లో మహేష్, పవన్ కళ్యాణ్ తరువాత ఆ రేంజిలో మాస్ ఇమేజ్ సంపాదించుకున్న చరణ్, ఎన్టీఆర్ లని ఒక చోటకి తీసుకోని రావడం రాజమౌళికి సాధ్యమైంది.రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు చాలా మంచి ఫ్రెండ్స్, ఆర్ ఆర్ ఆర్ సినిమా కన్నా ముందు నుంచే వీరు మంచి స్నేహితులు కాబట్టి ఆ బాడింగ్ తెరపైన ఇంకా ప్రమోషన్స్ లో కూడా కనిపించింది. టాలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోలు ఇంత స్నేహంగా ఎలా ఉండగలుగుతున్నారా అని ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయే రేంజులో చరణ్-ఎన్టీఆర్ కలిసి చాలా ప్రేమగా కనిపించారు. అయితే ఇదంతా ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కోసం మాత్రమే అని కామెంట్స్ చేసే వర్గానికి చెందిన కొంతమంది ఆడియన్స్ కూడా ఉన్నారు.


ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాకి సంబంధించిన పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి, ఇకపై చరణ్-ఎన్టీఆర్ లు కలిసి కనిపిస్తారా లేదా అనే ఆలోచన మెగా నందమూరి అభిమానులతో సినీ అభిమానులందరిలో కూడా ఎక్కువగా ఉంది. అందుకే రామ్ చరణ్ పుట్టిన రోజు అయిన ఈ రోజున ఎన్టీఆర్ నుంచి ట్వీట్ వస్తుందా లేదా అని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ఉదయం నుంచి ఎన్టీఆర్, చరణ్ కి ఎప్పుడు విష్ చేస్తాడా అని వెయిట్ చేసిన మ్యూచువల్ ఫాన్స్ కి గిఫ్ట్ ఇస్తూ ఎన్టీఆర్ 'హ్యాపీ బర్త్ డే మై బ్రదర్, హ్యావ్ ఏ బ్లాస్ట్' అంటూ మధ్యాహ్నం సింగిల్ లైన్ లో ట్వీట్ చేశాడు.ఎన్టీఆర్ ట్వీట్ చెయ్యడంతో ప్రస్తుత మెగా నందమూరి అభిమానులంతా కూడా ఎన్టీఆర్ ని రీట్వీట్ చేసే పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: