బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను ఏర్పరచుకున్న వారిలో అజయ్ దేవగన్ ఒకరు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరో గా మరియు ఇతర ముఖ్య పాత్రలలో నటించిన అజయ్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే అజయ్ "దృశ్యం 2" అనే రీమేక్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రేయ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

ఇలా దృశ్యం 2 మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న అజయ్ తాజాగా భోళా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అజయ్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. మార్చి 30 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయింది ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మొదటి రోజు మంచి ఓపెనింగ్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కించుకుంది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 11.20 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇలా ఈ మూవీ మొదటి రోజు సూపర్ సాలిడ్ ఓపెనింగ్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కించుకుంది. ఈ మూవీ లో టబు , సంజయ్ మిశ్రా , దీపక్ దొబ్రీయల్ , గజ్రాజ్ రావు , వినీత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ కి రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రస్తుతం కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: