మూవీ మొగల్ .. బాపట్ల మాజీ పార్లమెంటు సభ్యుడు.. ప్రముఖ సినిమా నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్లతో ఎన్నో చిత్రాలను తెరకెక్కించి అంతకుమించిన పాపులారిటీ దక్కించుకున్న రామానాయుడు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తదనంతరం వచ్చిన వెంకటేష్ , సురేష్ బాబు వ్యక్తిగత జీవితాలు చాలా వరకు గోప్యంగానే ఉంచబడ్డాయి. మరీ ముఖ్యంగా రామానాయుడు వ్యక్తిగత జీవితం , ఆయన సోదరీ సోదరులు ఎవరు అనేది ఎవరికీ తెలియదు ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఆయన సోదరుడు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామ్మోహన్రావు అలియాస్ మోహన్ బాబు 72 సంవత్సరాల వయసులో మంగళవారం ఉదయం కారంచేడులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు.

అయితే మోహన్ బాబు అంత్యక్రియలు అభిమానులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య బుధవారం సాయంత్రం కారంచేడు హిందూ స్మశాన వాటికలో నిర్వహించారు. మోహన్ బాబు మృతదేహానికి ఆయన మనవడు వెంకట సాయి ( మోహన్ బాబు చిన్న కూతురు స్వరూప కుమారుడు) అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇక మోహన్ బాబు అంత్యక్రియలకు సినీ అగ్ర హీరోలు దగ్గుబాటి రానా, అక్కినేని నాగచైతన్య, దగ్గుబాటి వెంకటేష్ , సురేష్ బాబు , అభిరామ్ లు మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిన్నాన్న మరణాన్ని చూసి వెంకటేష్ తట్టుకోలేకపోతున్నారు. ఇకపోతే మంగళవారం నుంచి గ్రామంలోనే ఉన్న సురేష్ బాబు,  మోహన్ బాబు బావమరిది ,సినీ నటుడు కొల్లా అశోక్ లు దగ్గరుండి మరీ ఆయన అంతక్రియల ఏర్పాట్లు పరిశీలించారు.

మోహన్ బాబు పార్థివ దేహంతో ప్రారంభమైన అంతిమయాత్రలో దగ్గుబాటి వారి దేవర ఇంటి వరకు వెంకటేష్ , నాగ చైతన్య,  రాణాలు పాడెను మోసారు. కుటుంబ సభ్యులు , గ్రామస్తుల మధ్య ఆయనకు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. ఇక మోహన్ బాబు విషయానికి వస్తే.. ఆయన భార్య శారదా దేవి.. కుమార్తెలు మాధవి,  స్వరూప లు వున్నారు.  అంతక్రియలో డాక్టర్ రామానాయుడు సతీమణి రాజేశ్వరి , కుమార్తె లక్ష్మి ఆమె కుటుంబ సభ్యులు అలాగే సురేష్ బాబు భార్య లక్ష్మి, వెంకటేష్ భార్య నీరజ,  రానా భార్య మిహిక , మనవళ్లు మనవరాలతో పాటు నిర్మాతలు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున అంత్యక్రియలలో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: