కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 1 ... కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ లతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని దేశ వ్యాప్తంగా దర్శకుడి గా తన కంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా  సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు.

మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే సలార్ మూవీ కి పార్ట్ 2 కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్మూవీ ని 2025 వ సంవత్సరం విడుదల చేసే విధంగా అని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మూవీ తర్వాత ఈ దర్శకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక మూవీ ని చేయబోతున్నాడు. ఈ మూవీ ని 2026 వ సంవత్సరంలో విడుదల చేసే విధంగా ఈ దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ... ప్రశాంత్ కాంబినేషన్ లో రూపొందుతున్న సలార్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జగపతి బాబు ... పృథ్వీరాజ్ సుకుమరన్ విలన్ పాత్రలలో కనిపించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: